ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అభ్యర్థులు అనుసరించాలి

ABN, First Publish Date - 2021-02-28T07:08:47+05:30

ఉభయగోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అభ్యర్థులు తూచా తప్పకుండా అనుసరించాలని ఎమ్మెల్సీ ఎన్నిక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఏఆర్‌వో), డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు సూచించారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులతో మాట్లాడుతున్న అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ సత్తిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ ఎన్నిక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ సత్తిబాబు 

కాకినాడ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అభ్యర్థులు తూచా తప్పకుండా అనుసరించాలని ఎమ్మెల్సీ ఎన్నిక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఏఆర్‌వో), డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు సూచించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. నియమావళి, పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రచారం, ఏజంట్లు, వివిధ రకాల ఫారాలు, బ్యాలెట్‌ పేపర్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఫొటో గుర్తింపు కార్డులు, ఎన్నికలపై ముద్రించిన పుస్తకాలను అభ్యర్థులకు ఇచ్చారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేయడానికి అభ్య ర్థులు సహకరించాలన్నారు. నియమావళి అమలు పర్యవేక్షణకు కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీనికి ఒక నోడల్‌ అధికారిని నియమించామన్నారు. ప్రచారానికి ఉపయోగించే లౌడ్‌ స్పీకర్లకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. వాహనాల వినియోగానికి ఆర్వో/ జిల్లా ఎన్నికల అధికారి అనుమతి ఇస్తారని, సమావేశాలు, ర్యాలీల కోసం పోలీసు శాఖ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే అబ్జర్వర్‌/ ఆర్వో/ జోనల్‌/ సెక్టార్‌ మెజిస్ర్టేట్‌/ భారత ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకురావచ్చని ఏఆర్వో స్పష్టం చేశారు.


Updated Date - 2021-02-28T07:08:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising