ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు రావాలి

ABN, First Publish Date - 2021-03-03T07:01:24+05:30

సామర్లకోట, మార్చి 2: సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు రాకపోతే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ బి.రాజకుమారి హెచ్చరించారు. మంగళవారం సామర్లకోట మండలం వేట్లపాలెంలోని 1,2,3 గ్రామ సచివాలయాలను ఆమె తనిఖీ చేశారు. సచివాలయాల్లో పలు రికార్డులను పరిశీలించి

వేట్లపాలెంలో సచివాలయం సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేకపోతే చర్యలు తప్పవు:  జేసీ రాజకుమారి హెచ్చరిక

సామర్లకోట, మార్చి 2: సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు రాకపోతే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ బి.రాజకుమారి హెచ్చరించారు. మంగళవారం సామర్లకోట మండలం వేట్లపాలెంలోని 1,2,3 గ్రామ సచివాలయాలను ఆమె తనిఖీ చేశారు. సచివాలయాల్లో పలు రికార్డులను పరిశీలించి పలు అంశాలపై సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. వైఎస్సార్‌ అసరా, చేయూత, బీమా వంటి పథకాల అమలులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు. సచివాలయానికి వచ్చే ప్రతీ దరఖాస్తు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, లేకుంటే తిరస్కరణకు గల కారణంపై దరఖాస్తుదారుడికి సమాచారం అందివ్వాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ అమలు చేయాలని జేసీ రాజకుమారి ఆదేశించారు.


Updated Date - 2021-03-03T07:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising