ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ మూడోదశను ఎదుర్కోవాలి

ABN, First Publish Date - 2021-06-23T04:35:12+05:30

భానుగుడి (కాకినాడ), జూన్‌ 22: కొవిడ్‌ మూడోదశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) కీర్తి చేకూరి కాకినాడ జీజీహెచ్‌ వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ

కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తున్న జేసీ కీర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయండి 

అధికారులకు జేసీ కీర్తి చేకూరి ఆదేశాలు

భానుగుడి (కాకినాడ), జూన్‌ 22: కొవిడ్‌ మూడోదశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) కీర్తి చేకూరి కాకినాడ జీజీహెచ్‌ వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లాలో కొవిడ్‌ మూడోదశ ప్రభావం, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయవలసిన సదుపాయాలపై జీజీహెచ్‌ ప్రత్యేక నోడల్‌ అధికారి జీ.సూర్యప్రవీణ్‌చంద్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్‌ మూడోదశను పూర్తిస్థాయిలో ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ఇప్పటి నుంచే అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. జీజీహెచ్‌ ఈన్‌టీ బ్లాక్‌ వద్ద పీడియాట్రిక్‌ విభాగానికి సంబంధించి 20 పడకలతో కూడిన ట్రాయాజ్‌, 200 పడకలతో ప్రత్యేక పిడియాట్రీక్‌ వార్డు, ఐసీయూ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఆపరేషన్‌ థియేటర్‌, ఎక్ర్సేమిషన్‌, అలా్ట్రసౌండ్‌ మిషన్‌, పిడియాట్రీక్స్‌ వెంటిలేటర్స్‌, ఈసీజీ పరికరాలు కొనుగోలు చేయాలన్నారు. ఈ సదుపాయాలకు అవసరమైన నిధులు ఆరోగ్యశ్రీ, ఆసుపత్రి సీఎ్‌సఆర్‌, కొవిడ్‌ నిధులు నుంచి కేటాయించాలన్నారు. జిల్లాలో కొవిడ్‌ రెండోదశ తగ్గుముఖం పట్టినప్పటికీ డాక్టర్లు, సిబ్బంది అలసత్వం వహించకుండా వైద్య సేవలు అందించాలన్నారు. జీజీహెచ్‌లో 369 కొవిడ్‌ యాక్టీవ్‌కేసులు, 126 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయని ఆమె తెలిపారు. సమావేశంలో జీజీహెచ్‌ సూపరిటిండెంట్‌ డా.ఆర్‌ మహాలక్ష్మి, ఆర్‌ఎమ్‌వోలు డా.గిరిధర్‌, డా.అనిత, సీఎ్‌సఆర్‌ఎమ్‌వో డా.పద్మ శశిధర్‌, పిడీయాట్రిక్‌ విభాగాధిపతులు, ఇతర వైద్యఅధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T04:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising