ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భాగస్వామ్య పరిశోధనతో సత్ఫలితాలు

ABN, First Publish Date - 2021-01-21T06:04:16+05:30

సామర్లకోట, జనవరి 20: రైతు భాగస్వామ్య కార్యాచరణ పరిశోధనతో సత్ఫలితాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు కేఎస్వీ.ప్రసాద్‌ తెలి పారు. సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామ పొలా ల్లో జిల్లా వ్యవసాయశాఖ, జిల్లా వనరుల కేంద్రం, ఏరువాకల సం

అచ్చంపేటలో రైతులకు సూచనలిస్తున్న ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ ప్రసాద్‌

సామర్లకోట, జనవరి 20: రైతు భాగస్వామ్య కార్యాచరణ పరిశోధనతో సత్ఫలితాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు కేఎస్వీ.ప్రసాద్‌ తెలి పారు. సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామ పొలా ల్లో జిల్లా వ్యవసాయశాఖ, జిల్లా వనరుల కేంద్రం, ఏరువాకల సంయుక్త ఆధ్వర్యాన బుధవారం రబీ వరిసాగుపై పొలంబడి అవగాహనా సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి యిమ్మిడిశెట్టి సత్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసాద్‌ మాట్లా డారు. పంటలపై తెగుళ్ల, చీడపీడల నివారణలకు రైతులు అనుభవరాహిత్యంతో విచక్షణా రహితంగా పురుగు మం దులు వినిమోగించడం వల్ల పంటలకు మేలు కలిగించే మిత్రపురుగులు అంతరించిపోమే ప్రమాదం ఉందన్నారు. జిల్లా వనరుల కేంద్ర డిప్యూటీ డైరక్టర్‌ నాగాచారి మాట్లాడుతూ చీడపురుగులను అదుపులో ఉంచేందుకు తక్కువ విష ప్రభావం గల మందులను అవసరం ఆధారంగా మాత్రమే వినియోగిస్తే పరాన్నజీవులు, బదనికలను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చే లాభాన్ని కూడా పొం దవచ్చని రైతులకు తెలిపారు. ఏరువాక ఏడీఏ, కాకినాడ ఏడీఏలు రాజశేఖర్‌, జీవీ.పద్మశ్రీ వెదజల్లు విధానంలో సాగులో క్షేత్రస్థాయిలో ఖాళీలను పూరించేందుకు శ్రద్ధ వహించడం ద్వారా సమాన దిగుబడులు పొందవచ్చని తెలిపారు. రైతు సాగుచేసే పంటలపై చీడపీడల నివారణకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సిఫార్సుల మేరకే పురుగుమందులు వినియోగించాలని సత్య సూచించారు. అనంతరం వ్యవసాయాధికారులు రైతులతో కలిసి క్షేత్రస్థాయి సందర్శనలు చేసి పలు సలహాలు ఇచ్చారు. మాజీ సర్పంచ్‌ సలాది బ్రహ్మనందరావు, సొసైటీ అధ్యక్షుడు వీరంరెడ్డి వెంకన్న, వీరంరెడ్డి పెదబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:04:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising