ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన ఆహారమందించే చర్యలు

ABN, First Publish Date - 2021-02-27T05:35:24+05:30

కాకినాడ రూరల్‌, ఫిబ్రవరి 26: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని డీఈవో అబ్రహం తెలిపారు. కాకినాడ రూరల్‌మండలం ఇంద్రపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్నభోజనాన్ని శుక్రవారం ఆయన పరి

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ రూరల్‌, ఫిబ్రవరి 26: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని డీఈవో అబ్రహం తెలిపారు. కాకినాడ రూరల్‌మండలం ఇంద్రపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్నభోజనాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. డీఈవో మాట్లాడుతూ నాణ్యత లేని ఆహారాన్ని తమకు పెడుతున్నారంటూ విద్యార్థులు గురువారం ఆందోళన చేయడం చాలా బాధాకరమని, ఈ విషయం తనకు తెలిసిన వెంటనే సంబంధిత సీతారామరాజు ట్రస్ట్‌ నిర్వాహకులను పిలిపించి మాట్లాడామన్నారు. భోజనం, గుడ్లు నాణ్యత కలిగినవి అందించేలా చూడాలని హెచ్చరించినట్టు ఆయన తెలిపారు. ఇకపై ఈ విధమైన సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించామన్నారు. ప్రతీరోజూ విద్యార్థులకు భోజనాలు పెట్టే ముందు ఆహార నాణ్యతను పరిశీలించాలని ప్రధానోపాధ్యాయురాలిని ఆదేశించామని తెలిపారు. డీఈవో వెంట ఎంఈవో గణే్‌షబాబు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఆహారం సరిగా లేదని పాఠశాలలో గురువారం ఆందోళన చేసినందుకు ప్రధానోపాధ్యాయురాలు నాగేశ్వరి విద్యార్థులకు టీసీలు ఇచ్చేస్తానని బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే అధికారులు కూడా ఇక్కడ తూతూ మంత్రంగా తనిఖీ చేసి వెళ్లిపోతున్నారని విద్యార్థులు చెప్తున్నారు.


Updated Date - 2021-02-27T05:35:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising