ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిచ్చికుక్క స్వైరవిహారం: 27మందికి తీవ్రగాయాలు

ABN, First Publish Date - 2021-10-17T06:39:22+05:30

పిచ్చికుక్క స్వైరవిహారం చేసి దాడిచేయడంతో 27మంది గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం బండారులంక గ్రామంలోని పేరివారికాలనీలో చందన తాతారావు అనే వృద్ధుడిని తొలుత తీవ్రంగా గాయపరిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం రూరల్‌, అక్టోబరు 16: పిచ్చికుక్క స్వైరవిహారం చేసి దాడిచేయడంతో 27మంది గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం బండారులంక గ్రామంలోని పేరివారికాలనీలో చందన తాతారావు  అనే  వృద్ధుడిని తొలుత తీవ్రంగా గాయపరిచింది. ఈగ్రామంలోనే 20మందిపై దాడిచేసి గాయపరిచింది. గాయపడ్డ కేదారి సుబ్బారావు, దాడి వెంకట్రావు, యలమంచిలి శ్యామ్‌కుమార్‌, ముత్తాబత్తుల కృష్ణమూర్తి, కోట లక్ష్మి, అంజూరి నాగలక్ష్మి తదితరులను స్థానికులు  అమలాపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పలువురు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 25 మందికి గాయాలు

అంబాజీపేట, అక్టోబరు 16: పిచ్చికుక్క స్వైరవిహారం చేసి 25 మందిపై దాడి చేయడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మాచవరంలో దొమ్మేటి త్రిమూర్తులుపై  పిచ్చికుక్క దాడి చేసింది. ఈప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈతకోట శ్రీనివాసరావు, పిల్లా అర్జునరావు, ఇసుకపూడిలో వెంకట్రావు, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, పళ్ళ సత్యనారాయణ, యలమంచిలి శ్యామ్‌కుమార్‌, పోతాయిలంకలో దంగేటి సతీష్‌, బండారులంకలో 8మంది, నరేంద్రపురంలో 6, మాచవరంలో ఆరుగురిని పిచ్చికుక్క తీవ్రంగా కరించింది. వీరిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

  12 మందికి గాయాలు

పి.గన్నవరం, అక్టోబరు 16: పలు గ్రామాల్లో పిచ్చికుక్క స్వైరవిహారంచేసి 12మందిని గాయపరిచింది. నరేంద్రపురంలో ఆరుగురిని,   రాజులపాలెంలో నలుగురు, పోతవరం, మాచవరం గ్రామాల్లో  ఒక్కొక్కరిని పిచ్చికుక్క గాయపరిచిందని పి.గన్నవరం సిహెచ్‌సీ వైద్య సిబ్బంది తెలిపారు. వీరికి ఎఆర్‌వీ ఇంజక్షన్‌ ఇచ్చి అమలాపురం ప్రభుత్వాసుపత్రికి  తరలించారు.


Updated Date - 2021-10-17T06:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising