ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డివిజన్‌ స్థాయి కాల్‌ సెంటర్లలో ఫిర్యాదులకు సత్వర పరిష్కారం

ABN, First Publish Date - 2021-05-16T06:32:53+05:30

జిల్లాలో 104 కాల్‌ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా డివిజన్‌ స్థాయిలో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి తెలిపారు.

మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్న జేసీ రాజకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 15: జిల్లాలో 104 కాల్‌ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా డివిజన్‌ స్థాయిలో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌  సెంటర్లో కాకినాడ డివిజన్‌కు సంబంధించి మహిళా పోలీసులకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆమె పాల్గొని ప్రసంగించారు. జిల్లాలోని అన్ని డివిజన్లలో 104 కాల్‌ సెంటర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా తక్కువ సమయంలో ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో నిత్యం అత్యధిక స్థాయిలో ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. కొవిడ్‌ పరీక్షలు, హోం ఐసోలేషన్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ , ఆసుపత్రుల్లో పడకల లభ్యత వంటి అంశాలపై 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను మహిళా పోలీసులు ఏ విధంగా పరిష్కరించాలో జేసీ వివరించారు. కాకినాడ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయ పరిపాలనాధికారి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-05-16T06:32:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising