ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతరలో అశ్లీల నృత్యాల జోరు

ABN, First Publish Date - 2021-02-28T07:07:28+05:30

తొండంగి మండలం ఒంటిమామిడిలో మాఘపౌర్ణమి సంధర్భంగా జరిగిన జాతరలో ఆశ్లీల నృత్యాలు, గుండాట వంటి కార్యక్రమాలు ఊపందుకోవడంతో స్థానికులు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఒంటిమామిడిలో అశ్లీల నృత్యాలు చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని, ఫిబ్రవరి 27: తొండంగి మండలం ఒంటిమామిడిలో మాఘపౌర్ణమి సంధర్భంగా జరిగిన జాతరలో ఆశ్లీల నృత్యాలు, గుండాట వంటి కార్యక్రమాలు ఊపందుకోవడంతో స్థానికులు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. విశ్వేశ్వరస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా మాఘపౌర్ణమి ముందురోజు పెద్దఎత్తున జాతర జరుగుతుంది. దీనిలో భాగంగా శుక్రవారం రాత్రినుంచి శనివారం తెల్లవారుజామువరకు జరిగిన జాతరలో గుండాటలు, ఇతర జూద క్రీడలు యథేచ్ఛగా జరిగాయి. వీటితోపాటు అశ్లీల నృత్యాలు కూడా ప్రదర్శించారు. స్థానిక అధికారులు పోలీసులు వీటిపై చర్య తీసుకోలేదని, వారి అండతోనే కార్యక్రమాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

అశ్లీల నృత్యాలపై చర్యలు తీసుకుంటాం: నార్త్‌జోన్‌ డీఎస్పీ

కోరుకొండ, ఫిబ్రవరి 27: ఇటీవల కోరుకొండ మండలం కాపవరం నూతన గ్రామ సర్పంచ్‌, పాలకవర్గ సభ్యులు అభినందన సభ జరిగింది. ఈ సభ తర్వాత పట్టపగలే అశ్లీల నృత్యాల ప్రదర్శన జరిగినట్లు తేలిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నార్త్‌జోన్‌ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం తనను కలిసి విలేకరులు ఈ విషయాన్ని తెలియజేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-02-28T07:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising