నేర నియంత్రణకు పకడ్బందీ చర్యలు
ABN, First Publish Date - 2021-10-30T04:55:49+05:30
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో నేరనియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 29: రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో నేరనియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన నేర నియంత్రణ, శాంతి భద్రతలు, పెండింగ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఆస్తి తగాదాలు, చోరీ కేసులు, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై సమీక్షించారు. అన్ని నేరాల కట్టడికి చర్యలు వేగవంతం చేయాలని ఎస్పీ చెప్పారు. రాత్రి గస్తీని పెంచాలని, అన్ని కూడళ్లు, అపార్టుమెంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించేలా చూడాలన్నారు, ఎన్‌డీపీఎస్ కేసుల పురోగతిపై చర్చించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ లతా మాధురి, జోనల్ డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:55:49+05:30 IST