ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వ్యాక్సిన్‌ జిల్లాకు వచ్చింది!

ABN, First Publish Date - 2021-04-14T05:58:41+05:30

కాకినాడ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఇటీ వల ఎక్కువ పెరుగుతుండడంతో వ్యాక్సిన్‌ వేయించుకోడానికి ప్రజలు క్యూకడుతున్నారు. కానీ టీకాలు అందుబాటులో లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో టీకా ఉత్సవం కూడా ఆశించిన ఫలి తం ఇవ్వక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎంహెచ్‌వో  గౌరేశ్వరరావు

కాకినాడ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఇటీ వల ఎక్కువ పెరుగుతుండడంతో వ్యాక్సిన్‌ వేయించుకోడానికి ప్రజలు క్యూకడుతున్నారు. కానీ టీకాలు అందుబాటులో లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో టీకా ఉత్సవం కూడా ఆశించిన ఫలి తం ఇవ్వకపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ఇచ్చిన అత్యవసర ఇండెంట్‌ మేరకు ఈనెల 12న జిల్లాకు కొవిషీల్డ్‌ డోసులు 35 వేలు వచ్చాయని, ఈనెల 14న కొవాగ్జిన్‌ డోసులు 36 వేలు వస్తున్నాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీఎస్‌ గౌరేశ్వరరావు తెలిపారు. వ్యాక్సిన్‌ కోసం రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న వారికి, చేయించుకోలేని వారికి కూడా ప్రస్తుతం వచ్చిన వ్యాక్సిన్‌ సరిపోతుందన్నారు. అందువల్ల ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, లక్ష్యిత వర్గాలందరికీ వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. కొరత తాత్కాలికమేనని, డిమాండ్‌ మేరకు ఎప్పటికపుడు టీకా జిల్లాకు వచ్చే లా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.

Updated Date - 2021-04-14T05:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising