ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌంటింగ్‌ కేంద్రానికి గట్టి బందోబస్తు

ABN, First Publish Date - 2021-09-19T05:37:43+05:30

జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు(కౌంటింగ్‌) కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు.

బొమ్మూరులో కౌంటింగ్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ, కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు చేయొద్దు 
  • అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 18: జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు(కౌంటింగ్‌) కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. శనివారం రాజమ హేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరు నేక్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ సెంటర్‌ను ఆయన, కార్పొరేషన్‌ కమిషనర్‌, పరిశీలకుడు అభిషిక్త్‌ కిషోర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద తీసుకోవా ల్సిన జాగ్రత్తలు, నిబంధనలు తెలియజేసారు. కౌంటింగ్‌కు హాజరయ్యే టీచర్లు, పోలీసులు, ఇతర ఉద్యోగులు కరోనా నిబంధనలు పాటించాలని, కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద 144 సెక్షన్‌ అమలులో వుందని, ఆ ప్రాంతంలో నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడరాదని, సెక్షన్‌ 30 అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు, అనుచరులు గ్రామాల్లో బాణాసంచ కాల్చడం, విజయో త్సవ ర్యాలీలు నిర్వహించడం చేయరాదని చెప్పారు. కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, ఏజెంట్‌లు రెవెన్యూ శాఖ జారీ చేసిన పాస్‌లు తప్పనిసరిగా ధరించాలని, అభ్యర్థులు వారి కారు డ్రైవర్లకు మాత్రమే చెక్‌పోస్టు వరకు అనుమతి వుందని, కౌంటింగ్‌ స్టాఫ్‌ వ్యక్తిగత వస్తువులు లోపలికి అనుమతి లేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి హెచ్చరించారు.

Updated Date - 2021-09-19T05:37:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising