ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలకు లోబడి కొంటాం!

ABN, First Publish Date - 2021-11-28T06:27:07+05:30

నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని, నిబంధనలకు లోబడి తడిచిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు స్పష్టంచేశారు.

మండపేటలో వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాలకు దెబ్బతిన్న చేలను పరిశీలించిన కన్నబాబు

మండపేట, నవంబరు 27 : నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని, నిబంధనలకు లోబడి తడిచిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు స్పష్టంచేశారు. శాసనసభ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పంట నష్టం పరిస్థితులను పరిశీలించాలని మంత్రులు, ఎమ్మె ల్యేలను ఆదేశించడంతో తాను ఉభయగోదావరి జిల్లాల్లో శనివారం పంట పొలాలను పరిశీలించానని చెప్పారు. మండపేట బైసాస్‌ రోడ్డులో మంత్రి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన తర్వాత మాట్లాడుతూ భారీ వర్షాలకు వరి బాగా దెబ్బతిందన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలని మంత్రిని కోరారు. మున్సిపల్‌ చైర్మన్‌ పతివాడ నూకదుర్గారాణి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టి.వనజారెడ్డి, ఆలమూరు తాలుకా రైస్‌మిల్లర్సు అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్‌, ఏడీ సీహెచ్‌కేవి చౌదరి, మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్‌, ఎంపీడీవో పాల్గొన్నారు.




Updated Date - 2021-11-28T06:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising