ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరం పరిష్కరించండి

ABN, First Publish Date - 2021-07-24T06:39:33+05:30

ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచంలా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో ఇకపై అలసత్వం వహించకుండా దళితులకు న్యాయం జరిగేలా కేసులను తక్షణం పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ మోనటరింగ్‌ కమిటీ సభ్యులు అయితాబత్తులు రామేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కలెక్టరేట్‌వద్ద దళిత మైనార్టీ ప్రజా సంఘాలు ఆందోళన

భానుగుడి(కాకినాడ), జూలై 23: ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచంలా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో ఇకపై అలసత్వం వహించకుండా దళితులకు న్యాయం జరిగేలా కేసులను తక్షణం పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ మోనటరింగ్‌ కమిటీ సభ్యులు అయితాబత్తులు రామేశ్వరరావు డిమాండ్‌ చేశారు. దళిత, మైనార్టీ, హక్కుల వామపక్ష, విప్లవ పార్టీలు, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అట్రాసిటీ కేసుల పరిష్కారంపై శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అయితాబత్తుల రామేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వెంకటాయపాలెం శిరోముండనం కేసును పరిష్కరించకుండా 23ఏళ్లుగా నెట్టు కుంటూ వస్తున్నారని, ప్రధాన నిందితుడు తోటత్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి దళితుల ను మరింత అగౌరపరుస్తున్నారని విమర్శించారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం దళితుల మ హిళలపై దాడి చేయించిన ఈఓ సూర్యనారాయణను అరెస్టు చేయాలని, వాకపల్లి దళితులపై దాడి చేసిన కుల దురహంకారులను అరెస్టు చేయాలన్నారు. ప్రజాసంఘాలు, దళిత సంఘాల నాయకులు ఎం.దుర్గాప్రసాద్‌, డి.శేషబాబ్జి, మోర్త రాజశేఖర్‌, ఆర్‌.లచ్చిబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T06:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising