ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనులు వేగవంతమవ్వాలి

ABN, First Publish Date - 2021-05-11T04:44:14+05:30

ఖనిజ నిధి ద్వారా జిల్లాలో చేపట్టిన వివిధ నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి
డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 10: ఖనిజ నిధి ద్వారా జిల్లాలో చేపట్టిన వివిధ నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ సమావేశాన్ని జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశతో కలిసి కలెక్టర్‌ వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఖనిజ నిధి ద్వారా జిల్లాలో చేపట్టిన వివిధ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్‌ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మైనింగ్‌ జరిగే ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి రోడ్లు, తాగునీరు, ఆరోగ్యం ఇతర అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇప్పటి వరకు జిల్లా ఖని జ నిధి కింద రూ.32 కోట్ల 89 లక్షల నిధులకు గాను వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.20 కోట్లు వినియోగించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రధానంగా ఖనిజ నిధి ద్వారా జిల్లాలో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చే యడంతో పాటు మిగిలి ఉన్న పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. తుని-కత్తిపూడి రోడ్డు మరమ్మతులకు రూ.60 లక్షలు, రాజానగరానికి సంబంధించి ఏడు ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులకు రూ.2 కోట్ల 64 లక్షల నిధులు మంజూరు చేస్తూ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అమలాపురం, రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్లు హిమాన్షు కౌశిక్‌, అనుపమ అంజలి, రంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య, డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, అన్ని ఇంజనీరింగ్‌ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

ఇసుక కొరత లేకుండా చర్యలు 

జిల్లాలో ప్రభుత్వ, ఇతర సాధారణ నిర్మాణ పనులకు సంబంధించి ఇసుక కొరత రానివ్వకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ సమావేశం అనంతరం కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. పడవలకు అడ్డు వచ్చే ఇసుకను తొలగించి దాంతో ఎటువంటి అమ్మకాలు చేపట్టకుండా వివిధ బోట్స్‌ మెన్స్‌ అసోసియేషన్ల వారికి అనుమతులు ఇవ్వాలన్నారు. జిల్లా బ్యాత్మెట్రిక్‌ సర్వే పూర్తి అవ్వడంతో ధవళేశ్వరం రిజర్వాయర్‌లో 14.6 మిలియన్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక పూడిక ఉందని తెలిపారు. రిజర్వాయర్‌ అభివృద్ధికి పూడిక తొలగించిన ఇసుకతో సాధారణ ప్రజల అవసరాలకు వినియోగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్‌ ఎస్పీ సుమిత్‌ గరుడ్‌, మైన్స్‌ ఏడీ డీవీఆర్‌ కుమార్‌, ఎస్‌ఎస్‌ఏ పీవో బి.విజయభాస్కర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ టి.గాయత్రీదేవి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ ఎం.నాగరాజు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎప్‌ ఎస్‌ఈ, ఇంజనీరింగ్‌ అధికారులు, అన్ని డివిజన్ల ఆర్‌డీవోలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising