ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ పతనం!

ABN, First Publish Date - 2021-04-11T06:42:36+05:30

కేరళ, తమిళనాడు తర్వాత ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే కొబ్బరి ఉత్పత్తులు గణనీయంగా ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కొబ్బరి మార్కెట్‌ డమాల్‌ 

పచ్చికొబ్బరి వెయ్యికాయ రూ.7 వేలు మాత్రమే

ఉత్పత్తులు ఘనం.. ధర శూన్యం

 పండుగలొస్తున్నా పుంజుకోని మార్కెట్‌

 ఇతర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తితో నిలిచిన కొబ్బరి ఎగుమతులు

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండ డంతో  ఆయా రాష్ర్టాల్లో విధించిన లాక్‌డౌన్‌ల వల్ల కొబ్బరి ఎగుమతులు అనూహ్యంగా తగ్గి బహిరంగ మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కొబ్బరి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాకపోవడంతో అయినకాడికి కొబ్బరికాయలను విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. నాఫెడ్‌ సంస్థ రైతుల నుంచి కొబ్బరి సరుకును కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం ఒక కారణమైతే, మూడు నెలల మూఢం కారణంగా వివాహాది శుభ కార్యక్రమాలు, కీలకమైన పండుగలు లేకపోవడంతో కొబ్బరి కాయల వినియోగం తగ్గడం వల్ల మార్కెట్‌ ధరలు పతనమయ్యాయి. పైగా ఏపీలో కొబ్బరి ఉత్పత్తులకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు  స్తంభించిపోయి మార్కెట్‌ తీవ్రంగా దెబ్బతింది.

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కేరళ, తమిళనాడు తర్వాత ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే కొబ్బరి ఉత్పత్తులు గణనీయంగా ఉంటాయి. ఈసారి ఈ మూడు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ వంటి రాష్ట్రా ల్లో కూడా కొబ్బరికాయల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. జిల్లాలో లక్షా 25 వేల హెక్టార్లలో కొబ్బరి పంట సాగవుతుంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి దిగుబడులు గణనీయంగా పెరగడంతో మార్కెట్‌ ధర పూర్తిగా పతనమైంది. పైగా కొబ్బరికాయల వినియోగం లేకపోవడంతో కొబ్బరికాయల ధరలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్‌, ఛత్తీస్‌గడ్‌ వంటి ఇతర రాష్ర్టాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ర్టా ల్లో లాక్‌డౌన్‌లు కూడా విధించారు. దాంతో ఆయా రాష్ర్టాల నుంచి గోదావరి జిల్లాల్లో ఉన్న కొబ్బరి మార్కెట్లకు బల్క్‌ ఆర్డర్లు లేకపోవడంతో ఉభయ తెలుగు రాష్ర్టాలకు మాత్రమే ఎగు మతులు పరిమితమయ్యాయి. రోజూ వంద లారీల వరకు కొబ్బరి సరుకు ఎగుమతులు అవు తున్నాయి. ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలతోపాటు మే రెండో వారం నుంచి వివా హాది శుభ కార్యక్రమాలు ప్రారంభం కానున్నప్పటికీ ఇతర రాష్ర్టాల నుంచి ఆర్డర్లు లేకపోవడం వల్ల ఎగుమతులు స్తంభించిపోయాయి. గతంలో వెయ్యి పచ్చికాయ రూ.1300 పలుకగా ప్రస్తు త ధర రూ.7వేల నుంచి రూ.8 వేలు పలుకుతోంది. కురిడీలోని వివిధ రకాల ధరలు కూడా పతన స్థితిలోనే ఉన్నాయి. కురిడీ పాత రకం గండేరా ఇప్పుడు రూ.14 వేలు పలుకుతోంది. గటగటా రకం రూ.11 వేలు ఉంది. కొత్తకొబ్బరి క్వింటాల్‌ రూ.12 వేలు, రెండోరకం రూ.10 వేలు ఉంది. కురిడీ కొబ్బరి కొత్తవి రూ.12 వేలు, గటగటా కొత్తవి రూ.12 వేలు పలుకుతోంది. నీటికాయ పాతముక్కుడుకాయ రూ.8 వేల నుంచి రూ.8,500, పచ్చికాయ ధర రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్య పలుకుతుండడంతో కొబ్బరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు ఉన్నా ధరలు లేకపోవడంతో రైతులు ఉత్పత్తులను పొలాల్లోనే రాశులుగా పోసి నిల్వ చేస్తున్నారు. దీనికితోడు కొబ్బరి ఆకులపై రూగోస్‌ వ్యాధి మళ్లీ విజృంభిస్తుండడంతో రైతు లు కలవరపడుతున్నారు. ఈ తెగులు గాని విస్తృతమైతే కొబ్బరి చెట్ల ఆకులతోపాటు పంట దిగుబడులు తగ్గి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. 



Updated Date - 2021-04-11T06:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising