ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరి రైతుకు నిరాశే...

ABN, First Publish Date - 2021-10-12T06:46:22+05:30

(అమలాపురం-ఆంధ్రజ్యోతి) వరుస పండుగలు వచ్చినా కొబ్బరి రైతులకు తీవ్ర నిరాశే మిగిల్చింది. ఇతర రాష్ర్టాలకు కొబ్బరికాయ ఎగుమతులు భారీగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కొబ్బరి మార్కెట్‌ ఆశించిన మేర పెరగకపోవడంతో రైతులు నిస్పృహలో ఉన్నారు. గత కొంతకాలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలసిరాని పండుగలు 

దసరా, దీపావళికి పెరగని రేట్లు

ఇతర రాష్ర్టాలకు నిలిచిన ఎగుమతులు 

రైతులు డీలా


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

వరుస పండుగలు వచ్చినా కొబ్బరి రైతులకు తీవ్ర నిరాశే మిగిల్చింది. ఇతర రాష్ర్టాలకు కొబ్బరికాయ ఎగుమతులు భారీగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కొబ్బరి మార్కెట్‌ ఆశించిన మేర పెరగకపోవడంతో రైతులు నిస్పృహలో ఉన్నారు. గత కొంతకాలం నుంచి కొబ్బరి ధరల్లో పెరుగుదల ఉంటుందని భావించి వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్ప న్నమవుతున్నాయి. ఇతర రాష్ర్టాల్లో కొబ్బరి ఉత్పత్తులు పెరగడంతోపాటు తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి నాణ్యమైన కొబ్బరి ఎగుమతులు పెర గడం వల్ల ఎగుమతులు ఆశించిన మేర లేవు. దసరా, దీపావళి పండుగల సమయంలోనూ కొబ్బరి ఎగుమతులు ఇరవై శాతానికి పడిపోవడంతో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. నిత్యం గోదావరి జిల్లాల నుంచి 150 లారీలకు పైగా ఎగుమతులు జరిగేవి. అయితే ఇతర రాష్ర్టాల నుంచి సరైన ఆర్డర్లు లేకపోవడంతో 30 లేదా 40 లారీలు మాత్రమే ఎగుమతి అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా డొక్కతో ఉన్న కాయే పశ్చిమబెంగాల్‌, బీహార్‌ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. గత కొన్ని నెలల నుంచి కొబ్బరి మార్కెట్‌ స్తబ్దతగానే ఉంది. ఎగుమతులు పెద్దగా లేకపోవడంతో రైతులు ఆశించిన మేర మార్కె ట్‌ పుంజుకోవడం లేదు. గోదావరి జిల్లాల్లో అతి ముఖ్యమైన మార్కెట్లలో ఒకటైన అంబాజీపేట మార్కెట్‌లో ఎగుమతులు లేక అటు వ్యాపారులు, ఇటు రైతులు డీలాపడ్డ పరిస్థితి ఉత్పన్నమైంది.


ముఖ్యంగా పచ్చికాయ వెయ్యింటికి ప్రస్తుతం రూ.9,200 నుంచి రూ.9,500 మధ్య ధర పలుకు తోంది. ముక్కుడుకాయ కూడా రూ.9 వేల నుంచి రూ.9,500 మధ్య ధర ఉంది. కొత్తకొబ్బరి క్వింటాల్‌ రూ.10,500, రెండోరకం రూ.10 వేల ధర పలు కుతోంది. కురిడీకొబ్బరి పాతరకం గండేరా వెయ్యింటికి రూ.16 వేలు, గట గటా వెయ్యింటికి రూ.14 వేల ధర లభిస్తుంది. కురుడీకొబ్బరి కొత్తరకం గం డేరా వెయ్యింటికి రూ.15 వేలు, గటగటా వెయ్యింటికి రూ.12.500 ధర పలు కుతోంది. ప్రస్తుతం కొబ్బరి దిగుబడులు కూడా తగ్గుముఖం పడుతున్నా యి. దిగుబడులు తగ్గడం వల్ల రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉండవచ్చని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొబ్బరికాయల విని యోగం కరోనా నేపథ్యంలో తగ్గుముఖం పట్టింది. పండుగలకు కూడా పెద్దగా వినియోగించే పరిస్థితి లేకపోవడంతో ఎగుమతులు స్తంభించిపోయి ధరల పెరుగుదల ఉండదేమోనన్న ఆందోళనలో రైతాంగం ఉంది.

Updated Date - 2021-10-12T06:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising