ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’పై అవగాహన

ABN, First Publish Date - 2021-06-23T04:44:58+05:30

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 22: త్వరలో సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభంకానున్న క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) పోగ్రామ్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కాకినాడ మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డి.పృధ్వీచరణ్‌ సూచించారు. ఇప్పటికే 40,41 డివిజన్లను ఎంపిక చేసిన నే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ హెల్త్‌ ఆఫీసర్‌ పృధ్వీచరణ్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 22: త్వరలో సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభంకానున్న క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) పోగ్రామ్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కాకినాడ మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డి.పృధ్వీచరణ్‌ సూచించారు. ఇప్పటికే 40,41 డివిజన్లను ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన 40వ డివిజన్‌కు కేటాయించిన తడిపొడి చెత్త వాహనాలను ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్‌ సుంకర శివప్రసన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్‌హెచ్‌వో మాట్లాడుతూ తడిపొడిచెత్త, హానికర వ్యర్థాలను విడివిడిగా అందజేసి క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌కు ప్రజలు సహకరించాలన్నారు. పారిశుధ్య సిబ్బంది మీ ఇంటి నుంచి చెత్తను తీసుకువెళ్లని పక్షంలో హెల్ప్‌ నెంబర్‌18004250325కు ఫోన్‌ చేయాలన్నారు. డివిజన్‌ ఇన్‌చార్జ్‌ సుంకర విద్యాసాగర్‌ మాట్లాడుతూ 40వ డివిజన్‌ ఫైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల్లో ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో శానీటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, డివిజన్‌ నాయకులు కెవాసు, సచివాలయ సిబ్బది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T04:44:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising