ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టి అక్రమ తరలింపు

ABN, First Publish Date - 2021-06-22T05:55:44+05:30

కోరుకొండ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. మట్టి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

మధురుపూడి చెరువులో మట్టిని తవ్విన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  మధురుపూడి చెరువు నుంచి కొల్లగొట్టిన వైనం
  • గాడాల ప్రైవేటు లేఅవుట్లకు తరలింపు

కోరుకొండ, జూన్‌ 21: కోరుకొండ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. మట్టి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. వారానికో చెరువులో మట్టిని కొల్లగొట్టుకుపోతు న్నారు. వందలాది లారీలు, ట్రాక్టర్లతో లాక్‌డౌన్‌ నియమ నిబంధనలను తుం గలో తొక్కి మట్టి మాఫియా సాగిస్తున్న ఈ అక్రమ తరలింపును అధికారులు అడ్డగించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నిడి గట్ల, గాడాల, గాదరాడ, నర్సాపురం, మునగాల, కాపవరం చెరువుల నుంచి కోట్లాది రూపాయల విలువైన మట్టిని కొల్లగొట్టుకుపోయారు. ఒక్కో గ్రామంలో నాలుగైదు జేసీబీలు, వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ చెరువుల్లో మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. రాజమహేంద్రవరం-కోరుకొండ ఆర్‌అండ్‌ బీ రహదారికి ఆనుకుని ఉన్న మధురుపూడి దుబ్బుల కుంట చెరువు నుంచి సుమారు రూ.20 లక్షలు విలులైన మట్టిని తరలించి చెరువుకు సమీపంలోని గాడాల గ్రామంలో లోలెవెల్‌లో ఉన్న ప్రైవేట్‌ లేఅవుట్‌లను మెరక చేశారు. ఇంత పబ్లిక్‌గా మట్టిని అక్రమంగా తరలిస్తున్నప్పటికీ మధురుపూడి, గాడాల రెవెన్యూ అధికారులు కానీ, మండల ఇరిగేషన్‌ అధికారికానీ, తహశీల్దార్‌ కానీ, మైనింగ్‌, పోలీస్‌ అధికారులు కానీ పట్టించుకోకపోవడంపై పలు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. పాలచర్ల గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు ప్రైవేట్‌ లే అవుట్ల యజమానుల నుంచి ఎకరానికి రూ.10 లక్షలు వంతున సుమారు రూ.3 కోట్లు తీసుకుని ప్రభుత్వ చెరువుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపి మట్టిని తరలిస్తున్నట్టు ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తక్షణం మైనింగ్‌ శాఖ అధికారులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు నిడిగట్ల, గాడాల, మధురుపూడి, మునగాల, గాదరాడ, నర్సాపురం చెరువులను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-06-22T05:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising