ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛాయాగ్రహకుడిగా అనపర్తి కుర్రాడు

ABN, First Publish Date - 2021-04-23T05:51:54+05:30

వెండితెరపై తన పేరు చూసుకోవాలన్న తపనతో అనుకున్నది సాధించారు అనపర్తికి చెందిన బొమ్మిశెట్టి జగదీష్‌. అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా అనుభవం సంపాదించి పూర్తిస్థాయిలో సినిమాటోగ్రాఫర్‌గా మారారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ‘శుక్ర’ సినిమాతో వెండితెరకు పరిచయం


అనపర్తి, ఏప్రిల్‌ 22: వెండితెరపై తన పేరు చూసుకోవాలన్న తపనతో అనుకున్నది సాధించారు అనపర్తికి చెందిన బొమ్మిశెట్టి జగదీష్‌. అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా అనుభవం సంపాదించి పూర్తిస్థాయిలో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. ఆయన ఛాయాగ్రహకుడిగా పనిచేసిన చిత్రం ‘శుక్ర’ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా జగదీష్‌ తన అనుభవాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ‘‘పదో తరగతి వరకు అనపర్తిలోనే విద్యాభ్యాసం సాగింది.  ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నాక కోయంబత్తూరులోని కారుణ్య ఇన్‌స్టిట్యూట్‌లో సినిమాటోగ్రఫీలో పట్టా సాధించి పలువురు వద్ద అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా చేశాను. సుకు పూర్వజ్‌ దర్శకత్వంలో ‘శుక్ర’ సినిమాకు  సినిమాటోగ్రఫీ చేశాను. నా కల నిజం కావడం ఎంతో ఆనందంగా ఉంది. త్వరలోనే అనపర్తి, పరిసర ప్రాంతాల్లో పల్లెటూరు వాతావరణంలో చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించాము. త్వరలోనే  వివరాలు  వెల్లడిస్తాం’ అని జగదీష్‌ చెప్పారు.



 



Updated Date - 2021-04-23T05:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising