ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమహేంద్రవరానికి రాజధాని అర్హతలు

ABN, First Publish Date - 2021-12-26T05:45:16+05:30

తెలుగువారి సంస్కృతి సాంప్రదాయలు, ప్రాచీన కళలు బతికి ఉన్న రాజమహేంద్రవరానికే ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయ్యే అన్ని అర్హతలున్నాయని శాసన సభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 25: తెలుగువారి సంస్కృతి సాంప్రదాయలు, ప్రాచీన కళలు బతికి ఉన్న రాజమహేంద్రవరానికే ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయ్యే అన్ని అర్హతలున్నాయని శాసన సభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. విఖ్యాత నాట్యపండితులు సప్పా దుర్గాప్రసాద్‌  రచించిన నర్తన యానం సంచికను స్థానిక నటరాజ నృత్యనికేతన్‌లో శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం విశిష్టతను వివరించారు. ఆలయ నృత్యంపై దుర్గాప్రసాద్‌ రచించిన గ్రంథాలు చరిత్రలో నిలిచాయన్నారు. అనంతరం కళాగౌతమి వ్యవస్థాపకుడు బీవీఎస్‌ మూర్తి, కృష్ణా ఆర్థో అధినేత డాక్టర్‌ ఎం.కృష్ణారెడ్డి, చేతిరాత నిపుణులు రాజేష్‌ కన్నా, చెళ్లపిళ్ల కళాసమితి కోశాధికారి బోనం సత్యనారాయణ, కలిశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. సప్పా సేవలను కొనియాడారు. దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ తాను రచించిన నర్తన చరితలు పరిశోధన గ్రంథం బెంగుళూరులో తెలుగువిజ్ఞాన సమితిలో ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు. మరిన్ని గ్రంధాలు సిద్ధంగా వున్నాయని అయితే రాజమహేంద్రవరం ప్రముఖులు ముద్రణకు సహకరించాలన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ కళారంగం నానాటికి కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.

Updated Date - 2021-12-26T05:45:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising