ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోటు షికారు ఇక ప్రియం!

ABN, First Publish Date - 2021-10-29T06:54:22+05:30

పాపికొండల బోటు షికారు ఇక ప్రియం కానుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ ఒకే టికెట్‌ నిర్ణయించారు. ఎవరికైనా సరే టికెట్‌ ధర రూ.1250. గతంలో పెద్దలకు రూ.750 ఉండేది. పిల్లలకు తక్కువ ఉండేది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పాపికొండల యాత్రకు ఒక్కో టిక్కెట్‌ ధర రూ.1250
  • గతంలో పెద్దలకు రూ.750, పిల్లలకు తక్కువ ఉండేది
  • వచ్చే నెల 7 నుంచి పోచమ్మ గుడి వద్ద నుంచి షికారు 

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పాపికొండల బోటు షికారు ఇక ప్రియం కానుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ ఒకే టికెట్‌ నిర్ణయించారు. ఎవరికైనా సరే టికెట్‌ ధర రూ.1250. గతంలో పెద్దలకు రూ.750 ఉండేది. పిల్లలకు తక్కువ ఉండేది. డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో తాము పాత ధరలకు బోట్లను తిప్పలేమని ప్రైవేట్‌ బోటు నిర్వాహకులు పట్టుపట్టడంతో ప్రభుత్వం ఈ ధరలు నిర్ణయించింది. అయితే టికెట్‌ కింద వసూలు చేసే రూ.1250తో రాజమహేంద్రవరం నుంచి యాత్రికుడిని గండిపోచమ్మ గుడి వరకూ తీసుకొస్తారు. అల్పాహారం ఉంటుంది. బోటులో షికారుకెళ్లిన తర్వాత లంచ్‌ ఏర్పాటుచేస్తారు. తిరుగు ప్రయాణంలో స్నాక్స్‌ ఇస్తారు. గండిపోచమ్మ గుడి వద్ద నుంచి గోదావరిలో బయలుదేరి పాపికొండలు చూపిస్తూ పేరంటాలపల్లి వరకూ యాత్ర సాగిస్తారు. అక్కడ నుంచి మళ్లీ తిరిగి పయనమై గండిపోచమ్మ గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ ట్రావెల్స్‌ వాహనాల్లో రాజమహేంద్రవ రం తీసుకొస్తారు. యాత్రికుడే స్వయంగా గండిపోచమ్మ గుడి వద్దకు చేరుకుంటే టికెట్‌ ధర తగ్గే అవకాశం ఉంది. కచ్చులూరు బోటు ప్రమా దం తర్వాత పాపికొండలయాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. వరద ల ముందు టూరిజం బోట్లు కొద్దిరోజులు తిప్పారు కానీ తర్వాత వాటి నీ ఆపేశారు. రెండు రోజుల కిందట టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు టూరిజం అధికారులు, ప్రైవేట్‌ బోటు ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో నవంబరు 7వ తేదీ నుంచి బోట్లు తిప్పడానికి నిర్ణయించారు. ఆరోజు భద్రాచలం వైపు పోచవరం నుంచి సుమా రు 12 బోట్లు నడిపే అవకాశం ఉంది. గండిపోచమ్మ గుడి నుంచి  5 నుంచి 6 బోట్లు ఉండవచ్చని చెబుతున్నారు. ఏపీ టూరిజం శాఖ చెం దిన రెండు బోట్లు కూడా తిరుగుతాయి. ఇక ఈ యాత్రలో ఏ వయస్సు పిల్లల వరకూ టిక్కెట్లు వసూలు చేస్తారనే విషయంలో స్పష్టత లేదు.

Updated Date - 2021-10-29T06:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising