ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలి

ABN, First Publish Date - 2021-02-27T06:40:37+05:30

పెంచిన డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలని, సరుకు రవాణా సమయంలో ఇచ్చే వే బిల్లులపై గడువు పొడిగించాలని, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించాలని, వాహన తుక్కు పాలసీని సవరణ చేయాలని, వాహనాలనుంచి గ్రీన్‌ టాక్స్‌ వసూలు నిలుపుదల చేయాలని, గడువు ముగిసిన టోల్‌గేట్లను తొలగించాలని తదితర డిమాండ్లతో అఖిలభారత లారీ ఓనర్స్‌ అసోసియేషన్లు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపులో భాగంగా జిల్లావ్యాప్తంగా లారీలు నిలిపివేసి శుక్రవారం నిరసన తెలిపారు.

రాజమహేంద్రవరంలో మానవహారంగా ఏర్పడి నిరసన చేస్తున్న వామపక్షపార్టీల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భారత్‌ బంద్‌తో నిలిచిన లారీలు

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), ఫిబ్రవరి 26: పెంచిన డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలని, సరుకు రవాణా సమయంలో ఇచ్చే వే బిల్లులపై గడువు పొడిగించాలని, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించాలని, వాహన తుక్కు పాలసీని సవరణ చేయాలని, వాహనాలనుంచి గ్రీన్‌ టాక్స్‌ వసూలు నిలుపుదల చేయాలని, గడువు ముగిసిన టోల్‌గేట్లను తొలగించాలని తదితర డిమాండ్లతో అఖిలభారత లారీ ఓనర్స్‌ అసోసియేషన్లు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపులో భాగంగా జిల్లావ్యాప్తంగా లారీలు నిలిపివేసి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లారీ యార్డ్‌లో వందలాది లారీలు నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కాకినాడ, జిల్లా అధ్యక్షుడు దుగ్గన బాబ్జి మాట్లాడుతూ కొవిడ్‌వల్ల పదినెలలకాలంగా లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరిశ్రమల్లో ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో లోడింగ్‌ లేక కిరాయిలు తగ్గాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం డీజిల్‌ ధరలను భారీగా పెంచడంతో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షా30వేల లారీలు నిలిపివేసి భారత్‌ బంద్‌లో పాల్గొన్నామన్నారు. అనంతరం రవాణ రంగ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కాకినాడ, జిల్లా అధ్యక్షుడు దుగ్గన బాబ్జి, కాకినాడ కార్యదర్శి చిలుకు గంగబాబు, కోశాధికారి గ్రంథి వెంకట రామారావు, ఉపాధ్యక్షులు తులసి వీరశంకరరావు, అల్లం రాజు, సంయుక్త కార్యదర్శిలు దాకే వెంకటేశ్వర్లు, ఎం.వీరబాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T06:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising