ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ABN, First Publish Date - 2021-12-31T06:13:53+05:30

గంజాయి అక్రమ రవాణాపై జిల్లా అంతటా ఉక్కుపాదం మోపినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు చెప్పారు.

వై.రామవరంలో పోలీస్‌ అధికారులతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు 
  • ఏజెన్సీలో పలు పోలీసుస్టేషన్ల తనిఖీ

వై.రామవరం, డిసెంబరు 30: గంజాయి అక్రమ రవాణాపై జిల్లా అంతటా ఉక్కుపాదం మోపినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతం వై.రామవరం పోలీస్‌స్టేషన్‌ను గురువారం సాయంత్రం తనిఖీ చేశా రు. ఎస్పీగా తొలిసారి ఆయన ఇక్కడకు విచ్చేశారు. గిరిజన గ్రామాల్లో క్రైమ్‌రేటు వివరాలపై ఆరా తీశారు. అసాంఘిక చట్టవ్యతిరేక కార్యకలాపాలవైపు వెళ్లకుండా గిరిజనుల్లో చైతన్యం తేవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ఆనుకొని ఉన్న ఏజెన్సీలోని పోలీస్‌స్టేషన్లలో పోలీస్‌లు అప్రమత్తపు చర్యలు పాటించాలన్నారు. సంక్రాంతికి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి సీఆర్‌పీఎఫ్‌ పోలీసుల విభాగం నూతనంగా నిర్మాణంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఎస్పీ వెంట రంపచోడవరం ఏఎస్పీలు కృష్ణకాంత్‌ పటేల్‌, కె.కుమార్‌(అడ్మిన్‌), సత్యనారాయణ(ఏఆర్‌), అడ్డతీగల సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ పృధ్వి ఉన్నారు.

Updated Date - 2021-12-31T06:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising