ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాక్‌లాక్‌ పోస్టుల భర్తీ విధానంపై అభ్యర్థుల ఆందోళన

ABN, First Publish Date - 2021-10-17T07:54:39+05:30

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల విద్యార్హత, ఒరిజనల్స్‌ ధ్రువీకరణపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని కాకినాడ కలెక్టరేట్‌ స్పందనహాల్‌లో శనివారం సోషల్‌ వెల్ఫేర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టరేట్‌లో ధ్రువపత్రాల పరిశీలన 

 భారీగా వచ్చిన నిరుద్యోగులు 

 ఒత్తిళ్లతో తమకు అన్యాయం చేయొద్దని ధర్నా

భానుగుడి(కాకినాడ), అక్టోబరు 16: ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల విద్యార్హత, ఒరిజనల్స్‌ ధ్రువీకరణపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని కాకినాడ కలెక్టరేట్‌ స్పందనహాల్‌లో శనివారం సోషల్‌ వెల్ఫేర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు చేపట్టారు. 32పోస్టులకుగాను కమాటీ, కుక్‌ పోస్టులకు సంబంధించి 1:5 నిష్పత్తిలో అధికారులు ధ్రువపత్రాల పరిశీలనకు అభ్య ర్థులను పిలిచారు. వెరిఫికేషన్‌కు అధికసంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. పరిశలన తర్వాత ఎస్సీ అభ్యర్థులు 25మంది, ఎస్టీ అభ్యర్థులు 9మందిని అధికారులు మెరిట్‌ ప్రాతిపదికన రెండు, మూడు రోజుల్లో ఎంపిక చేయనున్నారు. ఈ ధృవపత్రాల పరిశీలన కు జిల్లా సోషల్‌వెల్ఫేర్‌ అధికారి రంగలక్ష్మిదేవి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డీఎస్‌ సునీతతోపాటు విద్యాశాఖాధికారులు, ఎంప్లాయ్‌మెం ట్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అభ్యర్థులు పరిశీలన ప్రాంగణం ఎదురుగా ధర్నా చేపట్టారు. ఇంతమంది అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలించారని, ఏ ప్రాతిపధికన ఉద్యోగావకాశం కల్పిస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌  చేశారు. కష్టపడి పనిచేసే వారికే అవకాశం కల్పించాలని, రాజకీయ ఒత్తిడితో తమ లాంటి వారికి అన్యాయం చేయొద్దని వేడుకున్నారు.



Updated Date - 2021-10-17T07:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising