ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంప్రదాయబద్ధంగా అట్లతద్ది వేడుకలు

ABN, First Publish Date - 2021-10-24T06:38:24+05:30

పల్లె, పట్టణం అనే భేదం లేకుండా యువతులు, ముత్తయిదువులు, పిల్లలు తెల్లవారుజాము నుంచి అట్లతద్ది ఉపవాసాలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం రూరల్‌/టౌన్‌, అక్టోబరు 23: పల్లె, పట్టణం అనే భేదం లేకుండా యువతులు, ముత్తయిదువులు, పిల్లలు తెల్లవారుజాము నుంచి అట్లతద్ది ఉపవాసాలు చేశారు. తెల్లవారుజామునే అల్పాహారం స్వీకరించారు. శనివారం అమలాపురం పట్టణం, బం డారులంక, భట్నవిల్లి-శెట్టిపేట, ఈదరపల్లి తదితర గ్రామాల్లో మహిళలు సామూహికంగా అట్లతద్ది నోములు జరుపుకున్నారు. గౌరీపూజలు చేశారు. మధ్యాహ్నం ముత్తయిదువులకు వాయనాలు అందించారు. చంద్రోదయ సమయానికి వందలాది మంది మహి ళలు బారులు తీరి నదీమ తల్లి చెంతకు చేరుకున్నారు. బండారులంక చినచంద్రపురంలోని లోయర్‌కౌశిక నదీపాయ వద్దకు వందలాది మంది మహి ళలు చేరుకున్నారు. గంగమ్మకు పూజలు నిర్వహించారు.  భట్నవిల్లి శెట్టిపేటలో ముత్తైదువులు గౌరీపూజను వైభవంగా నిర్వహించారు. తొలుత 9,11,13, 15, 16ఏళ్ల కన్యలకు గౌరీ పూజలు జరిపించారు. మామిడికుదురు: అట్లతద్దెను మహిళలు భక్తిశ్రద్ధ లతో శనివారం జరుపుకున్నారు. కొత్తగా వివాహమైన యువతులు ముత్తయిదువులకు వాయనాలు అంద జేశారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. మాకనపాలెంలో ముత్తయిదువులు ఉల్లాసం గా, ఉత్సాహంగా ఊయల ఊగి అట్లతద్దెను ఘనంగా జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో అధిక సం ఖ్యలో మహిళలు, యువతులు పాల్గొన్నారు.

ముమ్మిడివరం: అట్లతద్దెను శనివారం మహిళలు  భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజామున స్నానాలాచరించి పేరంటాళ్లతో కలిసి భోజనాలు చేసి సాయంత్రం వరకు ఉపవాసాలు ఆచరించి గౌరీదేవికి పూజలు చేశారు. పేరంటాళ్లకు, ముత్తయిదువులకు వాయనాలు అందించారు. నూతన వధువులు, మహిళలు అట్లతద్దె జరుపుకున్నారు. అనంతరం గోవును పూజించి ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

అంబాజీపేట: అట్లతద్దోయ్‌... ఆరట్లోయ్‌ అంటూ శనివారం మహిళలు వైభవంగా అట్లతద్దిని జరుపుకున్నారు. అమ్మాయిలు, అమ్మలు, అమ్మమ్మలు అనే తేడాలేకుండా అందరూ ఈ పూజల్లో పాల్గొనడం విశే షం. అమ్మాయిలు తమకు మంచి భర్త దొరకాలని, అమ్మలు తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉం డాలని, అమ్మమ్మలు తమ జీవితం సాఫీగా సాగాలంటూ గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి పూజలు నిర్వహిం చి ఊయల ఊగారు.  సాయంత్రం మళ్లీ  గౌరీదేవికి పూజలు చేశారు. గోదావరి, నదీపాయల్లో దీపాలు, అర్ఘ్యాలు వదిలారు. అనంతరం ముత్తయిదువులు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గోపూజలు నిర్వహించారు. పలు గ్రామాల్లోని కౌశిక నదీతీరాలు, గోదావరి వద్ద మహిళల సందడి నెలకొంది. 

 

Updated Date - 2021-10-24T06:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising