ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీడీఏ పీవో వైఖరి మార్చుకోవాలి

ABN, First Publish Date - 2021-05-09T05:43:23+05:30

ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్న రంపచోడవరం ఐటీడీఏ పీవో వైఖరి మార్చుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనార్టీ ఉద్యోగుల ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి బాబ్జి హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌

రాజమహేంద్రవరం సిటీ, మే 8: ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్న రంపచోడవరం ఐటీడీఏ పీవో వైఖరి మార్చుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనార్టీ ఉద్యోగుల ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి బాబ్జి హెచ్చరించారు. రాజమహేంద్రవరంలోని అసోసియేషన్‌ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో సమర్థవంతంగా సేవలందిస్తున్న ఉద్యోగుల పట్ల పీవో అవమానకరంగా మాట్లాడారని, దీనిపై ఈనెల 4న జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళారని, అయినా పీవో వైఖరీలో మార్పు రాలేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ దీనిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో అసోసియేషన్‌ నాయకులు పి.రవికుమార్‌, సీహెచ్‌ సుబ్బారావు, చింతా అనిల్‌బాబు, ఎస్‌.గన్నియ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising