ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఎండీసీ ఉద్యోగుల తొలగింపునకు నిరసన

ABN, First Publish Date - 2021-04-23T05:50:48+05:30

ఏపీ మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఇసుక ర్యాంపులలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా గత రెండేళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించ డాన్ని నిరసిస్తూ అమలాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట గురు వారం నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురంటౌన్‌, ఏప్రిల్‌ 22: ఏపీ మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఇసుక ర్యాంపులలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా గత రెండేళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించ డాన్ని నిరసిస్తూ అమలాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట గురు వారం నిరసన తెలిపారు. జీవో నెం.25ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1922మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో నూతన ఇసుక పాలసీ విధానంలో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో ఏపీ ఎండీసీలో విలీనంచేసి ఐడీ నంబర్లు అందజేశా మన్నారు. జిల్లాలో 254 మంది సిబ్బంది కొవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. తమను యథావిధిగా ఉద్యో గాల్లో కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్‌కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి జవ్వాది వెంకటేశ్వరికి వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో దొమ్మేటి మోహన్‌ కుమార్‌, కొండలరావు, నాగభూషణం, కుడుపూడి మోహన్‌, లీలాపవన్‌, చేతన్‌, సాయికుమార్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-04-23T05:50:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising