ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ విగ్రహానికి దండలు తొలగింపుపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-04-17T05:56:01+05:30

అంతర్వేది సైకిల్‌ షాపు సెంటర్లో ఇటీవల అంబే డ్కర్‌ జయంతి సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహానికి, పక్కనే ఉన్న ఇందిరా గాంఽధీ, వంగవీటి మోహనరంగ, డాక్టర్‌ సత్యనారాయణ విగ్రహాలకు ఉన్న దండలను గురువారం అర్ధరాత్రి తొలగించడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్వేది, ఏప్రిల్‌ 16: అంతర్వేది సైకిల్‌ షాపు సెంటర్లో ఇటీవల అంబే డ్కర్‌ జయంతి సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహానికి, పక్కనే ఉన్న ఇందిరా గాంఽధీ, వంగవీటి మోహనరంగ, డాక్టర్‌ సత్యనారాయణ విగ్రహాలకు ఉన్న దండలను గురువారం అర్ధరాత్రి తొలగించడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సఖినేటిపల్లి ఎస్‌ఐ గోపాలకృష్ణకు ఫిర్యాదు చేయగా నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా దండలను తొలగించిన వారిని గుర్తించారు. అటుగా వెళ్తున్న టిప్పర్‌ లారీ క్లీనర్‌ అంబేడ్కర్‌ విగ్రహంపై ఉన్న మంచి దండలు తీసుకుని మిగిలిన దండలను రోడ్డుపై పడవేసి వెళ్లిపోయాడన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని ఎస్‌ఐ తెలిపారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి నల్లి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో తాడి నీలకంఠం, గెడ్డం అమ్ములు, చొప్పుల బుల్లియ్య, దొండపాటి రాజు  పాల్గొన్నారు. 



Updated Date - 2021-04-17T05:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising