ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుల అరెస్టు

ABN, First Publish Date - 2021-04-17T06:22:42+05:30

కోటనందూరు మండలం పాతకొట్టాంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తుని రూరల్‌ పోలీసుస్టేషన్‌లో సీఐ కె.కిషోర్‌బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.

నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రెండు సామాజికవర్గాల మధ్య పాత కక్షలే కారణం

తుని, ఏప్రిల్‌ 16: కోటనందూరు మండలం పాతకొట్టాంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తుని రూరల్‌ పోలీసుస్టేషన్‌లో సీఐ కె.కిషోర్‌బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పి.కొట్టాంలో మూడు రోడ్ల జంక్షన్‌ వద్దగల అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు పగులగొట్టారని తోలెం రాజు 13న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటనందూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో కోటనందూరు, తుని రూరల్‌, తొండంగి ఎస్‌ఐలు అశోక్‌, గణేష్‌కుమార్‌, విద్యాసాగర్‌లను మూడు బృందాలుగా ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేశారు. సంఘటనా స్థలంవద్ద భౌతిక ఆధారాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నేరస్తులు ఆ సమయంలో ఉపయోగించిన వాహనాలను గుర్తించారు. తద్వారా కేసులో ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని అతితక్కువ సమయంలో ఈ కేసును చేధించారు. కోటనందూరు మండలం కొత్త కొట్టాం గ్రామానికి చెందిన కూనిశెట్టి సాయిరాం అలియాస్‌సాయి, కూనిశెట్టి అన్వేషు, కూనిశెట్టి రాజసుబ్రహ్మణ్య గణేష్‌ అలియాస్‌ గణేష్‌, అల్లు శ్రీనివాస్‌ అలియాస్‌ వాసు, కూనిశెట్టి శివాజీ 12వతేదీ రాత్రి కోటనందూరులో ఒక దాబాలో స్నేహితుడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుని, తర్వాత వీరు ఐదుగురు అదే సమయంలో రాత్రి 11గంటలకు ఎవరూ లేని సమయంలో పాత కొట్టాం సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని బండరాయితో కొట్టారు. అనంతరం అక్కడినుంచి కేఈ చిన్నయ్యపాలెంవైపు మోటారుసైకిల్‌పై పారిపోయారు. దీనికి ప్రధాన కారణం గతంతో రెండు సామాజికవర్గాల మధ్య జరిగిన గొడవలను మనస్సులో పెట్టుకుని విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టుకు హాజరుపర్చినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసును తక్కువ సమయంలో చేధించడంతో డీఎస్పీతోపాటు తుని రూరల్‌ సీఐ, ఎస్‌ఐలను, ఏఎస్‌ఐ వి.నాగేశ్వరరావు, టీవీ రత్నం, హెచ్‌సీలు రాంబాబు, వెంకటేశ్వరరావు, పోలీసు కానిస్టేబుల్స్‌ దేవి కిరణ్‌, సీతష్‌, రమేష్‌, వీరబాబు, భరత్‌జ్యోతి, బాలరాజు, అప్పలరాజు, హెచ్‌సీ నాయుడులను ఎస్పీ నయీం అస్మీ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2021-04-17T06:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising