ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రిమెంట్‌పై లేబర్‌ కమిషనర్‌కు ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-06-22T05:52:39+05:30

అగ్రిమెంట్‌ ఆలస్యం కావడంతో మేనేజిమెంట్‌తో పాటు యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని లేబర్‌ కమిషనర్‌ నుంచి జేసీఎల్‌, డీసీఎల్‌ వరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు కోస్టల్‌ పేపర్స్‌ స్ఠాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబా సోమవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడియం, జూన్‌ 21: అగ్రిమెంట్‌ ఆలస్యం కావడంతో మేనేజిమెంట్‌తో పాటు యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని లేబర్‌ కమిషనర్‌ నుంచి జేసీఎల్‌, డీసీఎల్‌ వరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు కోస్టల్‌ పేపర్స్‌ స్ఠాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి జి.సాయిబాబా సోమవారం తెలిపారు. వాటి కాపీలను డైరెక్టర్‌ (కమర్షియల్‌) చీఫ్‌ పైనాన్షియల్‌ ఆఫీస్‌, టి.అనీష్‌మాధ్యూ, జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ఏలూరు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.సూరారెడ్డి, ఏవీపీ (ఐఆర్‌) ఎ.జయకృష్ణలకు పంపించామన్నారు. సాయిబాబా మాట్లాడుతూ గత వేతన ఒప్పందం 2019 జూన్‌ 30తో ముగిసిందన్నారు. అప్పటి నుంచి ఏవిధమైన అగ్రిమెంట్‌ చేయడానికి మేనేజ్‌మెంట్‌ముందుకు రావడం లేదన్నారు. అక్టోబరు నెలలో డైరెక్టర్‌ ఆఫ్‌ (కమర్షియల్‌)చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ టి.అనీష్‌ మాధ్యూతో చర్చలు జరిపి అగ్రిమెంట్‌ చేసి తమకు న్యాయం చేయాలని కోరగా తక్షణమే చర్యలు ప్రారంభించి అగ్రిమెంట్‌ పూర్తి చేయాలన్నారు. దీంతో డిసెంబర్‌ నెలలో పూర్తిచేస్తామని చెప్పి మరలా నిలిపేశారన్నారు. ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా శాంతియుతంగా 28రోజుల పాటు నిరసన తెలిపామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయని, కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Updated Date - 2021-06-22T05:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising