ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

600 కిలోల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-05-08T06:05:09+05:30

ప్రత్తిపాడు జాతీయ రహదారిపై గోవిందపురం కొండ జంక్షన్‌ సంతోషిమాత ఆలయం వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి మూటలతో సీఐ రాంబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాడు, మే 7: ప్రత్తిపాడు జాతీయ రహదారిపై గోవిందపురం కొండ జంక్షన్‌ సంతోషిమాత ఆలయం వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.  ప్రత్తిపాడు సీఐ వై.రాంబాబు, ఎస్‌ఐ కె.సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా పాడేరు నుంచి రాజమహేంద్రవరానికి బొలెరో వాహనంలో 600 కిలోల గంజాయిని లోడ్‌చేసి శుక్రవారం ఇద్దరు వ్యక్తులు బయల్దేరారు. ఈ వాహ నం హైవేపై గల సంతోషిమాత ఆలయం వద్దకు చేరుకోగానే పోలీ సులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి దొరికిపోవడంతో డ్రైవర్‌ పరారయ్యాడు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం కిన్నెర్లకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. తహశీల్దార్‌ పీపీవీ గోపాలకృష్ణ సమక్షంలో గంజాయిని, వాహనాన్ని సీజ్‌ చేశారు. 14 మూటల్లో ఉన్న 600 కిలోల గంజాయి మార్కెట్‌ విలువ రూ.15 లక్షల వరకు ఉంటుందని సీఐ తెలిపారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-05-08T06:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising