ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి మూడో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-03-01T06:43:55+05:30

జిల్లాలో మూడో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను సోమవారం ప్రారంభిస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీఎస్‌ గౌరీశ్వరరావు తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయసుండి దీర్ఘకాలిక వ్యాధులున్న (కో-మార్బిడ్‌) వారికి టీకా వేస్తామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 ఏళ్ల కో-మార్బిడ్‌ వారికి టీకా

కాకినాడ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను సోమవారం ప్రారంభిస్తున్నామని  డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీఎస్‌ గౌరీశ్వరరావు తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయసుండి దీర్ఘకాలిక వ్యాధులున్న (కో-మార్బిడ్‌) వారికి టీకా వేస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా రిజిస్టర్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ నుంచి వారి వ్యాధి ధ్రువీకరించిన పత్రం తీసుకురావాలన్నారు. వీరంతా సమీపంలో ఏదైనా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ (పీహెచ్‌సీ, యూహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, జీజీహెచ్‌)ల్లో వ్యాక్సిన్‌ ఉచితంగా వేయించుకోవచ్చన్నారు. వెళ్లేటపుడు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ అనుబంధ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ డోసుకు రూ.150, సర్వీస్‌ చార్జీ రూ.100... మొత్తం రూ.250 చెల్లించాలి. కాకినాడ పరిధిలో అపోలో, ఇనోదయ, సంజీవిని, రాజమహేంద్రవరం పరిధిలో జీఎస్‌ఎల్‌, కమలాకర్‌, కిమ్స్‌, సాయి, అమలాపురంలో కిమ్స్‌ ఆస్పత్రుల్లో సోమవారం ఒక్కరోజే వ్యాక్సిన్‌కు అవకాశం ఉంది. మార్చి 2వ తేదీ నుంచి మిగిలిన అన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అనుబంధ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ వేస్తారు. గతంలో రిజిసే్ట్రషన చేయించుకోలేని హెల్త్‌కేర్‌ వర్కర్స్‌, మొదటి డోసుకు రిజిసే్ట్రషన చేయించుకుని వ్యాక్సిన్‌ తీసుకోని వారు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ ఎవరైనా ఉంటే వ్యాక్సినేషన సెంటర్లకు వెళ్లి అక్కడికక్కడే రిజిసే్ట్రషన చేయించుకుని వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని డీఎంహెచవో చెప్పారు. 


Updated Date - 2021-03-01T06:43:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising