ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1076 ‘రేషన్‌’ వాహనాలు రెడీ : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-01-20T07:10:42+05:30

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), జనవరి19: ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీకి సంబంధించి 19 నియోజకవర్గాలకు మండలాల వారీగా 1076 మొబైల్‌ వాహనాలను పంపేందుకు సిద్ధం చేశామని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జాయింట్‌ కలెక్టర్లు జి లక్ష్మిశ, చేకూ

కాకినాడలో ఉంచిన మొబైల్‌ వాహనాలను పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్‌, జేసీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), జనవరి19: ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీకి సంబంధించి 19 నియోజకవర్గాలకు మండలాల వారీగా 1076 మొబైల్‌ వాహనాలను పంపేందుకు సిద్ధం చేశామని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జాయింట్‌ కలెక్టర్లు జి లక్ష్మిశ, చేకూరి కీర్తి, జి రాజకుమారి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్‌ కాకినాడ క్రీడాప్రాంగణంలో మొబైల్‌ వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 21న రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అదే సమయంలో కాకినా రంగరాయ మెడికల్‌ కాలేజీ వద్ద ఈ వాహనాల ప్రారంభోత్సవ సభ జరుగుతుందన్నారు. అనంతరం మండలాల వారీగా వాహనాలు చేరుకుంటాయన్నారు. ఈ ప్రక్రియను జిల్లా స్థాయి సివిల్‌ సప్లయిస్‌ అధికారులు, సబ్‌ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు పర్యవేక్షిస్తారని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ కరణం కుమార్‌, డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, డీఎస్‌వో ప్రసాద్‌, సివిల్‌ సప్లయిస్‌ డీఏం ఇ లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-20T07:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising