ద్వారకా తిరుమల స్వామి వారి దర్శన వేళల్లో మార్పులు
ABN, First Publish Date - 2021-06-10T21:38:11+05:30
ద్వారకా తిరుమల స్వామి వారి దర్శన వేళల్లో మార్పులు
ఏలూరు: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. అయితే స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి సూచించారు.
కాగా రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ సమయాన్ని సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఉదయం 6.30 నుంచి 12 వరకూ ఉన్న లాక్‌డౌన్‌ను మధ్యాహ్నం 2 గంటల వరకూ మినహాయింపు ఇచ్చారు. దీంతో ఆలయాల్లోకి భక్తులను కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతించనున్నారు.
Updated Date - 2021-06-10T21:38:11+05:30 IST