ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్ మాఫియాకు తెలుగు రాష్ట్రాలు అడ్డాగా మారాయి..

ABN, First Publish Date - 2021-10-03T19:52:30+05:30

హైదరాబాద్: డ్రగ్స్ మాఫియాకు తెలుగు రాష్ట్రాలు అడ్డాగా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డ్రగ్స్ మాఫియాకు తెలుగు రాష్ట్రాలు అడ్డాగా మారాయి. నిన్న గుజరాత్‌.. ఇవాళ ముంబాయి.. ఇలా ఎక్కడ డ్రగ్స్ పట్టుపడినా.. దాని లింకులు తెలుగు రాష్ట్రాల్లో బయటపడుతున్నాయి. ఏపీ కేంద్రంగా గుజరాత్ డ్రగ్స్ లింకులు బయటపడితే.. ఇవాళ ముంబయి డ్రగ్స్ లింకులు హైదరాబాద్‌లో ఉన్నట్టు తేలింది.


తమిళనాడు సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఎన్సీబీ బృందం దాడి చేసింది. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నం చేసిన డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. ఎఫిడ్రిన్ తయారీ హైదరాబాద్ కేంద్రంగా నడిచినట్లు విచారణలో వెల్లడైంది. ముంబైలోని అంథేరిలో  ఐదు కోట్ల విలువైన ఎఫిడ్రిన్‌ను ఎన్సీబీ బృందం స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల తయారీ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. మాదకద్రవ్యాల ముడి సరుకును హైదరాబాద్‌కు దిగుమతి చేసుకొని ఎఫిడ్రిన్‌గా మార్చి అక్రమంగా దందా సాగుతోందని, విదేశాలకూ హైదరాబాద్ నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు ఎన్సీబీ గుర్తించింది.


ఇటీవల గుజరాత్ ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున పట్టుపడ్డ డ్రగ్స్ దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ దాదాపు రూ. 21వేల కోట్లుగా ఉన్నట్లు తేలడంతో పెనుదూమారం రేపింది. అంతేకాదు గుజరాత్ ముంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుబడితే దాని మూలాలు  ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తూర్పుగోదావరి జిల్లాలు బయటపడ్డాయి. విజయవాడకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి అడ్రస్ దొరకడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.

Updated Date - 2021-10-03T19:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising