ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవరత్నాలతో ‘పుర’ ప్రచారం!

ABN, First Publish Date - 2021-03-05T09:43:46+05:30

పురపాలక ఎన్నికల్లో నవరత్న పథకాలనే వైసీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంది. ఈ తొమ్మిది హామీలతో పాటు.. 21 నెలల పాలనను చూసి ఓటేయాలని రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ కరపత్రాల పంపిణీ


అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పురపాలక ఎన్నికల్లో నవరత్న పథకాలనే వైసీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంది. ఈ తొమ్మిది హామీలతో పాటు.. 21 నెలల పాలనను చూసి ఓటేయాలని రాష్ట్ర ప్రజలను కోరింది. ఈ మేరకు నాలుగు పేజీల కరపత్రాన్ని పంపిణీ చేస్తోంది. ‘నగరాభివృద్ధిలో నవశకానికి శ్రీకారం.. జగనన్న పాలనలో అభివృద్ధి బంగారం’ శీర్షికతో ముద్రించిన ఈ కరపత్రంలో.. మంచి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతును ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇంటికే పింఛన్లు, రేషన్‌ సరుకులు.. వార్డు సచివాలయాల ద్వారా ఇతర పౌరసేవలు, చదువు-బడి పేరిట కార్యక్రమాలు.. వైద్యం- ఆరోగ్యం, రైతు-వ్యవసాయం, అక్క చెల్లెమ్మల కోసం జగనన్న చేదోడు, ఎంఎ్‌సఎంఈ వైఎ్‌సఆర్‌ నవోదయం, పట్టణ, నగర ప్రజలకు తక్కువ ధరకు ప్లాట్లు, పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలను ఇందులో వివరించారు. కమలాపురం, కుప్పంలను కొత్త మున్సిపాలిటీలుగా చేయడం.. మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలను కలిపేసి మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడాన్నీ ప్రస్తావించారు.

Updated Date - 2021-03-05T09:43:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising