ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సంచలన నిజాలు వెల్లడించిన కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2021-02-10T21:29:09+05:30

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఉక్కుశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిజాలు బయటపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఉక్కుశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిజాలు బయటపెట్టారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రి వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. పోస్కో ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో 2019 అక్టోబర్‌లో ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఒప్పందం తర్వాత సీఎం జగన్‌ను పోస్కో ప్రతినిధులు కలిశారని చెప్పారు. 


విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికే 3 సార్లు పోస్కో బృందం సందర్శించిన విషయాన్ని కేంద్రమంత్రి తెలిపారు. పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం కుదిరిందన్నారు. పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు జాయింట్ వర్కింగ్‌ గ్రూప్‌ను.. ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త ప్లాంట్‌లో పోస్కో వాటా 50 శాతంగా ఉంటుందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని సమాధానమిచ్చారు. పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని కేంద్రం రహస్యంగా ఉంచడంపై పలువురు మండిపడుతున్నారు.    

Updated Date - 2021-02-10T21:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising