ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్డీఆర్‌ఎఫ్‌లోకి మహిళలు

ABN, First Publish Date - 2021-07-31T09:08:57+05:30

స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌లోకి మహిళలను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిశీలిస్తున్న పోలీసు శాఖ: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌


విజయవాడ, జూలై 30(ఆంధ్రజ్యోతి): స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌లోకి మహిళలను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. నేషనల్‌ రెస్క్యూ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్డీఆర్‌ఎ్‌ఫకు చెందిన 540మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారంతా విజయవాడ పున్నమి ఘాట్‌లో శుక్రవారం ప్రదర్శన ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రజల సహకారాన్ని తీసుకునేందుకు.. వారిని రెస్క్యూ ఆపరేషన్‌లో భాగస్వాములను చేయాలని భావిస్తున్నామన్నారు. ప్రకృతి విపత్తులు, ప్రమాదాల సమయాల్లో ఉత్తమ సేవలు అందించిన 19మంది పేర్లను జీవనరక్ష పురస్కారాలకు సిఫారసు చేశామని బెటాలియన్స్‌ అదనపు డీజీ శంకబ్రత బాగ్జీ వెల్లడించారు. కాగా, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు త్వరలోనే యూనిఫాం అందజేస్తామని డీజీపీ తెలిపారు. 

Updated Date - 2021-07-31T09:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising