ఆ దారుణాలు వైసీపీ నేతలకు కనిపించడం లేదా?: దేవతోటి నాగరాజు
ABN, First Publish Date - 2021-07-11T15:51:06+05:30
టీడీపీ నేత దేవతోటి నాగరాజు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత దేవతోటి నాగరాజు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంబాజీపేటలో దళిత మహిళలపై దాడులు, కాకినాడలో దళిత యువకుడి హత్య , పొన్నూరులో జరిగిన దారుణాలు వైసీపీ నేతలకు కనిపించటం లేదా..? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులు స్వేచ్ఛగా జీవించే రోజులు అసలు ఉండవా..?, దళితుల్ని ఓటర్లుగా తప్ప మనుషులుగా గుర్తించరా..? అని నాగరాజు నిలదీశారు.
Updated Date - 2021-07-11T15:51:06+05:30 IST