‘దేవాంగ కులాన్ని దేవళ మతంగా గుర్తించాలి’
ABN, First Publish Date - 2021-01-25T08:39:17+05:30
: దేవాంగ కులాన్ని దేవళ మతంగా ప్రభుత్వం గుర్తించాలని దేవాంగ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు.
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 24: దేవాంగ కులాన్ని దేవళ మతంగా ప్రభుత్వం గుర్తించాలని దేవాంగ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన సంఘం సదస్సులో దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాంగ కులానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. పంచాంగ కర్తలు, పురోహితులు, సిద్ధాంతులు దేవాంగుల్లో ఉన్నారని, అందువల్ల దవళమతంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 10 లక్షలు మంది దేవాంగులు ఉంటే కేవలం 2.50 లక్షలు మాత్రమే చూపిస్తున్నారని, దేవాంగ గణన జరగాలన్నారు. అప్పడే దేవాంగ కార్పొరేషన్‌కు ఏ గ్రేడ్ వస్తుందని పేర్కొన్నారు.
Updated Date - 2021-01-25T08:39:17+05:30 IST