ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతల నిర్బంధం

ABN, First Publish Date - 2021-05-25T09:12:23+05:30

కరోనా బాధితులకు భరోసా పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా బాధితులకు టీడీపీ భరోసా అడ్డగింత

ఎక్కడికక్కడ నేతల అరెస్టులు, గృహ నిర్భంధం


అమరావతి, మే 24 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులకు భరోసా పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు... పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. కరోనా బాధితులకు భరోసా పేరిట ఆస్పత్రులను సందర్శించి అక్కడ కరోనా చికిత్సలు అందుతున్న తీరును పరిశీలించాలని, బాధితులకు ఓదార్పు ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు పార్టీకి చెందిన కీలక నేతలంతా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకునేందుకు సిద్ధమయ్యారు. అయి తే ముందుగానే ఈ సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎ మ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, గృహ నిర్బంధం చేశారు. తూ ర్పు గోదావరి జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయ ల చినరాజప్ప, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఆదిరెడ్డి భవాని, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, వనమాడి కొండబాబు, జ్యోతుల నెహ్రూ, వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్‌లను గృహ నిర్బంధంలో ఉం చారు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పార్టీకి చెందిన కీలక నేతలు మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్‌.అమరనాధ రెడ్డి, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, బీటెక్‌ రవి, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కూన రవి కుమార్‌, కందికుంట ప్రసాద్‌, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కేఏ నాయుడు, పీలా గోవింద్‌ తదితరులను గృహ నిర్బంధం చేశారు.


చంద్రబాబు ఖండన

కరోనా బాధిత రోగులను పరామర్శించి చికిత్సల తీరు తెలుసుకోవడానికి వెళ్తున్న టీడీపీ నేతల అరెస్టు, గృహ ని ర్భంధాలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ‘‘టీడీపీ నాయకులు ఆస్పత్రులు సందర్శించి రోగులతో మాట్లాడితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటీ? రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా ముఖ్యమంత్రి గడప దాటి బయటకు రారు. టీడీపీ నేతలు వెళ్తుంటే అడ్డుకొంటున్నారు. ఆస్పత్రులను ముఖ్యమంత్రి ఎందుకు సందర్శించరు? ఆయనకు బాధ్యత లేదా? పౌర హక్కుల్ని హరించి ప్రశ్నించే గొంతులను అణిచివేయడంలో మాత్రం ఆయన ముందుంటున్నారు. కరోనా నివారణ చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’’ అని ఆయన విమర్శించారు. తమ పార్టీ నేతల పర్యటనలను అడ్డుకోవడం జగన్‌ పిరికితనానికి నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.  

Updated Date - 2021-05-25T09:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising