ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ రైతుబజార్ల వికేంద్రీకరణ

ABN, First Publish Date - 2021-04-23T10:55:18+05:30

కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లను వికేంద్రీకరించాలని, పట్టణాల్లో మొబైల్‌ రైతుబజార్లను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ పీఎన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న ఆదేశం 


అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లను వికేంద్రీకరించాలని, పట్టణాల్లో మొబైల్‌ రైతుబజార్లను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ పీఎన్‌ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. గురువారం మార్కెటింగ్‌ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గతేడాది మాదిరిగానే  రైతుబజార్లలో కూరగాయల కోసం రద్దీ ఏర్పడకుండా, వికేంద్రీకరణ చేపట్టాలన్నారు. 10ు మార్జిన్‌తో కూరగాయలు, పండ్లు అమ్మేలా మొబైల్‌ రైతుబజార్ల ఏర్పాటుకు అనుమతించాలని జిల్లా ఏడీలను ఆదేశించారు. కోల్డ్‌స్టోరేజీల నుంచి నేరుగా మిర్చి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజు వారీ ధరల విశ్లేషణ, రోజు వారీ ధరల నివేదికలను ఆయా యాపుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. కాగా, 2019-20 రబీ సీజన్‌లో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని, వడ్డీతో సహా సకాలంలో చెల్లించిన రైతులు, వాస్తవ సాగుదారులందరికీ సున్నా వడ్డీ రాయితీ వర్తింపజేసేందుకు ఈనెల 10 వరకు వచ్చిన క్లెయిములను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-04-23T10:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising