ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణం తీర్చుకుంటున్న డీజీపీ: వర్ల

ABN, First Publish Date - 2021-01-17T08:36:23+05:30

‘‘తనకు పదవి ఇచ్చిన వారి రుణం తీర్చుకోవడమే పనిగా డీజీపీ గౌతం సవాంగ్‌ వ్యవహరిస్తున్నారు. అధికారులు రాజకీయ నేతల్లా మాట్లాడటం ఏమిటి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘‘తనకు పదవి ఇచ్చిన వారి రుణం తీర్చుకోవడమే పనిగా డీజీపీ గౌతం సవాంగ్‌ వ్యవహరిస్తున్నారు. అధికారులు రాజకీయ నేతల్లా మాట్లాడటం ఏమిటి? ఏదైనా సంఘటన జరిగితే అందులో బాధ్యుల పేర్లు చెప్పడం పోలీసు అధికారులకు ఆనవాయితీ. కానీ, వారి రాజకీయ నేపథ్యం కూడా వెలికితీసి, ఫలానా పార్టీవారు చేశారని ఫక్తు రాజకీయ నాయకుని మాదిరిగా డీజీపీ మాట్లాడుతున్నారు. వైసీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్ర్కిప్ట్‌ చదవడమే ఆయన ఉద్యోగంగా మారింది’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘సిట్‌ ఇచ్చిన సమాచారంతో డీజీపీ మాట్లాడారా లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాచారంతో మాట్లాడారా? విగ్రహాల ధ్వంసం గురించి ఘోరంగా మాట్లాడిన మంత్రులను ఎందుకు అరెస్టు చేయలేదు?’’ అని నిలదీశారు. 


 దర్యాప్తు పూర్తికాక ముందే ఎలా మాట్లాడతారు:అశోక్‌బాబు

దేవాలయాలపై జరిగిన దాడుల ఘటనల విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత దాని దర్యాప్తు పూర్తి కాక ముందే డీజీపీ ఎలా మాట్లాడతారని టీడీపీ ఎమ్మెల్సీ పీ అశోక్‌ బాబు ప్రశ్నించారు.  

Updated Date - 2021-01-17T08:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising