ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణపట్నంలో ‘డీ సల్ఫరైజేషన్‌’ టెక్నాలజీ

ABN, First Publish Date - 2021-04-19T09:32:08+05:30

కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సల్ఫర్‌ ఉద్గారాలను తగ్గించే టెక్నాలజీని ఏర్పాటు చేయాలని ఏపీ జెన్‌కో నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సల్ఫర్‌ ఉద్గారాలను తగ్గించే టెక్నాలజీని ఏర్పాటు చేయాలని ఏపీ జెన్‌కో నిర్ణయించింది. బొగ్గు ఆధారంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసే కేంద్రాల్లో కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్న కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ సూచించిన నమూనా ప్రకారం ఫ్లూ గ్యాస్‌లోని సల్ఫర్‌ ఉద్గారాలను తగ్గించడానికి ఈ విధానాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విధానం అమలుకు రూ.900 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన టెండర్‌ పత్రాలను న్యాయ పరిశీలనకు పంపారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 26 వరకు న్యాయ పరిశీలన కమిషన్‌ వెబ్‌సైట్‌కు పంపవచ్చని విద్యుత్‌ శాఖ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-04-19T09:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising