ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూపులతో పార్టీకి నష్టం

ABN, First Publish Date - 2021-02-28T08:43:48+05:30

‘గ్రూపులు కట్టడం వల్లే కుప్పంలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. గ్రూపిజం వదిలిపెట్టి అందరూ సమష్ఠిగా ఎన్నికల్లో సత్తా చాటాలి’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కుప్పంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయకులు పనిచేయకే పంచాయతీల్లో ఓటమి

దాన్ని గుర్తుంచుకుని తీరు మార్చుకోండి

సమష్టిగా పనిచేసి సత్తా చాటండి

పరిషత్‌, మున్సిపల్‌ అభ్యర్థుల భేటీలో చంద్రబాబు

ముగిసిన నియోజకవర్గ పర్యటన


కుప్పం, ఫిబ్రవరి 27: ‘గ్రూపులు కట్టడం వల్లే కుప్పంలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. గ్రూపిజం వదిలిపెట్టి అందరూ సమష్ఠిగా ఎన్నికల్లో సత్తా చాటాలి’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కుప్పంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం రాత్రి ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఒకరి లోపాలు ఒకరు బయట పెట్టుకోవడం మంచిది కాదన్నారు. నాలుగు మండలాల రాజకీయ వ్యవహారాలను చూసుకునేందుకు కొత్తగా ఒక పీఏని నియమించామన్నారు. నాయకులు పనిచేయకపోవడంవల్లే పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి సంభవించిందని, ఈ విషయం గుర్తుంచుకుని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. శనివారం ఉదయం పార్టీలోని యువకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను, అరాచకాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయాలని పిలుపునిచ్చారు. కాగా.. చంద్రబాబు కుప్పం పర్యటన శనివారంతో ముగిసింది.

Updated Date - 2021-02-28T08:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising