ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్ మాట తప్పారు: సీపీఐ

ABN, First Publish Date - 2021-09-08T20:14:15+05:30

విద్యుత్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ విశాఖ ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ విశాఖ ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రజలపై సీఎం జగన్ భారం మోపుతున్నారని సీపీఐ నేతలు విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాతో ఉపాధిలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో మరింత వడ్డన పడుతోందన్నారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజునే ప్రత్యేకించి విద్యుత్ చార్జీలపై మాట్లాడారన్నారు. విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలపై భారం లేకుండా చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చి.. మాటతప్పారని విమర్శించారు. 


జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్నిధరలు పెరిగిపోయాయని సీపీఐ నేతలు ఆరోపించారు. గతంలో పెట్రోల్ ఉత్పత్తులు పెరిగినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ విమర్శించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల పేర్లుతో పన్నులు పెంచుతున్నారని సీపీఐ నేతలు మండిపడ్డారు. 

Updated Date - 2021-09-08T20:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising