ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రి పోయినా.. రానన్న కుమారుడు

ABN, First Publish Date - 2021-05-08T09:01:19+05:30

కరోనా కోరల్లో చిక్కి ప్రాణాలు కోల్పోతున్న వారిని తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకురాని సంఘటనలు చూస్తూనే ఉన్నాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నెగిటివ్‌ అయినా అనాథశవంగా అంత్యక్రియలు


ఆకివీడు, మే 7: కరోనా కోరల్లో చిక్కి ప్రాణాలు కోల్పోతున్న వారిని తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులెవరూ ముందుకురాని సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ.. తండ్రి కొవిడ్‌తో కాకుండా అనారోగ్యంతో చనిపోయాడని తెలిసినా.. వచ్చి తలకొరివి పెట్టేందుకు ఓ కొడుకు నిరాకరించాడు. దీంతో అనాథశవంగా అంత్యక్రియలు పూర్తిచేసిన విషాద ఘటన ఇది. కృష్ణా జిల్లా చినతాడినాడ యువరంపాడుకు చెందిన కలిదిండి రాంబాబు (63) తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దివ్యాంగుడైన అల్లుడు నరసింహరావు మోటారుసైకిల్‌పై కూర్చోబెట్టుకుని వైద్యం నిమిత్తం శుక్రవారం ఆకివీడు సీహెచ్‌సీకి తీసుకొచ్చాడు. వైద్యుడు రంగారావు పరీక్షించి అప్పటికే చనిపోయాడని తెలిపారు. అనంతరం కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. అల్లుడు దివ్యాంగుడు కావడంతో సీహెచ్‌సీ సిబ్బంది మృతుడి కుమారుడికి.. ఫోన్‌ చేసి తండ్రి చనిపోయిన సమాచారం అందించారు. ప్రస్తుతం తాను ఊరిలో లేను మీరే కానిచ్చేయండి అంటూ ఆ కొడుకు సమాధానమిచ్చాడు. దీంతో సిబ్బంది అవాక్కయ్యారు. చినతాడినాడ సర్పంచ్‌కు సమాచారం అందించగా కార్యదర్శి, సచివాలయ ఉద్యోగులను పంపించారు. కైలాస నిలయం వాహనంలో మృతదేహాన్ని యువరంపాడుకు తరలించి వారే అంత్యక్రియలు పూర్తిచేశారు.

Updated Date - 2021-05-08T09:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising