ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో దారుణం.. దహన సంస్కారాలకు ఒక్కో రేటు!

ABN, First Publish Date - 2021-05-10T00:51:41+05:30

గుంటూరులో దారుణం.. దహన సంస్కారాలకు ఒక్కో రేటు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కరోనా కాలంలో చావులపై పేలాలు వేరుకుంటున్నారు. చావుల్లో రకాలు చూపుతూ డబ్బులు దండుకుంటున్నారు. సాధారణ చావుకైతే రూ.2,200, కరోనా మరణానికైతే రూ.5,100 రేటు కట్టి మరీ దోచుకుంటున్నారు. ఇలా సాక్షాత్తు గుంటూరు నగర పాలక సంస్థే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇచ్చట దహన సంస్కారాలు చేయబడునంటూ పాత గుంటూరు హిందూ శ్మశాన వాటిక గోడపై రాశారు. టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా జత చేశారు. ఈ రాతను చూసిన కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మనిషి చనిపోయిన తర్వాత కూడా వారికి మనశ్శాంతి లేదని, ఇది రాష్ట్ర దౌర్భాగ్యమని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇది నిజంగా గుంటూరు నగర పాలక సంస్థే రాసిందా? లేదా బయట వ్యక్తులు రాశారా? అనేది తెలియాల్సి ఉంది. 


Updated Date - 2021-05-10T00:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising