ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ముగ్గురు ఉద్యమంలో పాల్గొనడం వల్లే కేంద్రం దిగి వచ్చింది: sailajanath

ABN, First Publish Date - 2021-11-19T17:18:31+05:30

మూడు వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనడంతోనే కేంద్రం దిగి వచ్చిందని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మూడు వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనడంతోనే కేంద్రం దిగి వచ్చిందని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మూడు నల్ల చట్టాలపై కేంద్రం కమిటీలతో కాలయాపన చేయవద్దన్నారు. రైతుల పాలిట శాపంగా పరిణమించిన వ్యతిరేక చట్టాలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హరిత విప్లవంతో ఇందిరాగాంధీ హయాం నుంచి జై జవాన్... జై కిసాన్ అన్న నినాదంతో రైతన్నలను కాంగ్రెస్ పార్టీ ఆదుకుందని తెలిపారు. నేడు  బీజేపీ అన్నం పెట్టే రైతన్నను రోడ్ల పైకి తీసుకు వచ్చిందని విమర్శించారు. అహంకార ధోరణితో ప్రతిపక్షాల సూచనలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన ఈ మూడు నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేసి మేలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇన్ని నెలల పాటు కుటుంబాలను వదిలి అకుంఠిత దీక్షతో ఆందోళనల్లో పాల్గొన్న రైతన్నలకు ఏపీ కాంగ్రెస్ కమిటీ పాదాభివందనం చేస్తోందని శైలజానాథ్ తెలిపారు. 

Updated Date - 2021-11-19T17:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising