ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి పండే భూముల్లో ఇతర పంటలు పండవు: కాంగ్రెస్ నేత

ABN, First Publish Date - 2021-10-29T20:53:45+05:30

యాసంగిలో వరి పంట వేయవద్దని చెబుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద వ్యవసాయ ప్రణాళిక లేదని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యాసంగిలో వరి పంట వేయవద్దని చెబుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద వ్యవసాయ ప్రణాళిక లేదని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకసారి సన్నాలు వేయమంటారు, ఇంకోసారి మొక్కజొన్న వెయ్యవద్దు అంటారు... ఇష్టానుసారంగా మాట్లాడుతూ రైతులను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పండే భూముల్లో ఇతర పంటలు పండవన్నారు. ఏ పంట ఎప్పుడు వెయ్యాలి ఎక్కడ వెయ్యాలి అన్నది రైతులకు స్పష్టత ఉందని చెప్పారు. కానీ సిద్దిపేట కలెక్టర్ ఒకవిధంగా... వ్యవసాయ మంత్రి మరొక విధంగా... మంత్రి హరీష్ రావు ఇంకో విధంగా మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని కాలెక్టరేట్‌లను ముట్టడిస్తామని హెచ్చరించారు. నవంబర్ ఒకటో తేదీన కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2021-10-29T20:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising